చాకలి ఐలమ్మ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట,మహబూబ్‌నగర్ పట్టణాల్లో ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుకు కృషి చాకలి ఐలమ్మకు ఘనంగా నివాళులర్పించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి నారాయణపేట, సెప్టెంబర్26 (నేటి దర్శిని):భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాటాలు చేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ సేవలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ భగీరథ కాలనీలో...