Newspaper Banner
Date of Publish : 10 September 2025, 3:17 pm Digital Edition : Unknown Author

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి: రాజ్ కుమార్ రెడ్డి

ఎల్బీనగర్ లో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

ఎల్బీనగర్, సెప్టెంబర్10 (నేటి దర్శిని): తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు, వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్బీనగర్ చౌరస్తాలో ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక కులస్తులతో కలిసి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చాకలి ఐలమ్మ వీరోచిత పోరాటాన్ని ప్రతిఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. మహనీయుల ఆశయ సాధనకు అందరూ కంకణబద్దులై ఉద్యమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చంద్రం, మోహన్, రాము, శివ, రజక కులస్తులు పాల్గొన్నారు.