రూ.73వేలకు గణేషుడి లడ్డును దక్కించుకున్న మల్లికార్జున్

మల్లికార్జున్ ను సన్మానించిన నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేసిన మల్లికార్జున్ ఎల్.బి.నగర్, సెప్టెంబర్06 (నేటి దర్శిని):యువజన భక్త సమాజం ఆధ్వర్యంలో సరూర్‌నగర్‌ గాంధీ బొమ్మ వద్ద సీనియర్ నాయకులు బోయిని మహేందర్ యాదవ్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా 62 ఏళ్లుగా గణనాథుడిని ప్రతిష్టించి విశేష పూజలు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రుల పాటు విశేష పూజలు చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా శనివారం నిర్వహించిన లడ్డూ వేలంలో చాట్లపళ్లి మల్లికార్జున్...