Newspaper Banner
Date of Publish : 04 September 2025, 4:09 pm Digital Edition : Unknown Author

గణనాథుడి సేవలో రాజ్ కుమార్ రెడ్డి

వివిధ వినాయక మండపాలను సందర్శించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్

నారాయణపేట, సెప్టెంబర్04 (నేటి దర్శిని):
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని కలాల్ వాడి, సరఫ్ బజార్, జాజాపూర్, అప్పంపల్లి తదితర ప్రాంతాల్లో నెలకొల్పిన వినాయక మండపాలను ఫౌండేషన్ సభ్యులతో కలిసి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సందర్శించి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయా మండప నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని, ఫౌండేషన్ సభ్యులను శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మధుసూదన్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, సల్ల వెంకటేష్, వై.సంతోష్, రాజప్పగౌడ్, ఎం.సంతోష్ చామకూర నగేష్, బాలు నాయక్, చందు నాయక్, మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.