కొండారెడ్డిపల్లి చెరువు ప్రాంతంలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన రాజ్ కుమార్ రెడ్డి
ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి నారాయణపేట,సెప్టెంబర్04 (నేటి దర్శిని): నవరాత్రులపాటు విశేష పూజలు అందుకున్న గణనాథులను నిమజ్జనం చేసేందుకు సంబంధిత అధికారులు కొండారెడ్డిపల్లి చెరువు వద్ద ఏర్పాట్లు చేస్తున్నారు. నారాయణపేట జిల్లా కొండారెడ్డిపల్లి చెరువు ప్రాంతంలో జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను గురువారం ఫౌండేషన్ సభ్యులతో కలిసి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గణేష్ నిమజ్జనానికి వచ్చే గణేష్ మండపాల నిర్వాహకులకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వివిధ శాఖల అధికారులు...