Newspaper Banner
Date of Publish : 03 September 2025, 3:32 pm Digital Edition : Unknown Author

మహర్షి మిశ్వామిత్ర ఆధ్వర్యంలో అన్నదానం

పూజలకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట, సెప్టెంబర్03 (నేటి దర్శిని): నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాపునగర్ చౌరస్తాలో మహర్షి విశ్వామిత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం భీష్మరాజ్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదానంలో రాజ్ కుమార్ రెడ్డి పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మహర్షి మిశ్వామిత్ర  సభ్యులు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, హన్మంతు ముదిరాజ్, రాఘవేందర్ గౌడ్, నర్సింహ, ఎం.సంతోష్, అశోక్, వై.సంతోష్, నందుకుమార్, రాజప్ప గౌడ్, నాగురావు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.