ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ఓటు చోరీ హటావో – ప్రజాస్వామ్యం బచావో పోస్టల్ కార్డు ఉద్యమం

ఎమ్మెల్యే బాలు నాయక్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించిన NSUI నాయకులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రాష్ట్రపతికి వినతి దేవరకొండ , సెప్టెంబర్ 03 ( నేటి దర్శిని): ఎన్‌ఎస్‌యూఐ (NSUI) చేపట్టిన 'ఓటు చోరీ హటావో – ప్రజాస్వామ్యం బచావో' పోస్టల్ కార్డు ఉద్యమంలో భాగంగా, దేవరకొండ శాసనసభ్యుడు బాలు నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి లేఖ రాసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం దేవరకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. NSUI జాతీయ సోషల్ మీడియా కోఆర్డినేటర్ పానుగంటి శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.ఈ సందర్భంగా...