రైతులకు యూరియా అందించాలంటూ నిడమనూరులో సిపిఎం రాస్తారోకో, ధర్నా
నిడమనూరు, సెప్టెంబర్01 (నేటి దర్శిని): నిడమనూరు మండల కేంద్రంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని, ముఖ్యంగా పంటల రక్షణకు అవసరమైన యూరియా ఎరువులను సకాలంలో సరిపడా అందించాలంటూ సిపిఎం నాయకత్వంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఉదయం 7:30 గంటల నుండి 9:30 గంటల వరకు రాస్తారోకో కొనసాగి, వందలాది మంది రైతులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీ సభ్యుడు కొండేటి శ్రీను, మండల కమిటీ సభ్యులు వింజమూరి శివ, కిరణ్ మాట్లాడుతూ – ప్రస్తుతం మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులు తీవ్ర...