పేటలో ఘనంగా భగవాన్ బలరామ జయంతి

నారాయణపేట,ఆగస్టు29 (నేటి దర్శిని):భగవాన్ బలరామ జయంతి వేడుకలను నారాయణపేట జిల్లా కేంద్రంలో భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నాగురావు నామాజీ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాడే భగవాన్ బలరాముడు రైతుల పక్షాన నిలిచి అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. మహనీయుల అడుగుజాడల్లో నడవాలని కోరారు. అంతకుముందు వారిని నిర్వాహకులు శాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్...