హైదరాబాద్-నక్క రామయ్య కాలనీ రోడ్డులో బ్రిడ్జి నిర్మించాలి

హైదరాబాద్-నక్క రామయ్య కాలనీ రోడ్డులో కొట్టుకుపోయిన వాగు ప్రాంతాన్ని సందర్శించిన భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం నారాయణపేట,ఆగస్టు23 (నేటి దర్శిని):ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్-నక్క రామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, భారీ వర్షాల కారణంగా ఇద్దరు పిల్లలు కొట్టుకుపోయి చెట్టును పట్టుకొని ఆగిపోయారని కాలనీవాసులు వాపోయారు. నారాయణపేట జిల్లా హైదరాబాద్-నక్క రామయ్య కాలనీలో ఎగువ భాగాల నుండి వచ్చే నీరు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతమైన నక్క రామయ్య కాలనీ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయిందని, తమను ఆదుకోవాలని కోరుతూ...