క్యాతన్ పల్లి వీరభద్రేశ్వరస్వామి దేవాలయంలో పూజలకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

బాపన్ పల్లి శివాలయంలో అన్నదానం నారాయణపేట,ఆగస్టు23 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్ పల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో శ్రావణమాస శాశ్వత రుద్రాభిషేకం-స్వామివారి కల్యాణ మహోత్సవ వేడుకలను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఉత్సవాలకు హాజరయ్యారు. అంతకుముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదానాన్ని రాజ్ కుమార్ రెడ్డి ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం...