ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి:రాజ్ కుమార్ రెడ్డి

◻️    పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు ◻️    మొక్కలు నాటిన భీష్మరాజ్ ఫౌండేషన్ బృందం నారాయణపేట జూలై30 (నేటి దర్శిని):పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలను నాటాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకొని భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణ కేంద్రంలోని శాసనపల్లి రోడ్డులో ఉన్న కాశీనాథేశ్వర కాలనీలో మంగళవారం కాలనీవాసులు, ఫౌండేషన్ సభ్యులతో కలిసి రాజ్ కుమార్ రెడ్డి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన...