వీరభద్రేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో కల్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన

◽త్వరలోనే అందుబాటులోకి కల్యాణ మండపం: రాజ్ కుమార్ రెడ్డి ◽రాజ్ కుమార్ రెడ్డి, సభ్యులను సత్కరించిన దేవాలయ నిర్వాహకులు నారాయణపేట జూలై25 (నేటి దర్శిని):భక్తుల సౌకర్యార్థం దేవాలయ ప్రాంగణంలో కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికబద్దంగా చర్యలు తీసుకుంటున్నామని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజకుమార్ రెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతనపల్లి గ్రామంలోని శ్రీశ్రీశ్రీ భద్రకాళి సమేత వీరభద్రేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించనున్న నూతన కల్యాణ మండప నిర్మాణానికి దేవాలయ నిర్వాహకులు, గ్రామస్తులు,...