కేటీఆర్ సంచలన ట్వీట్
హైదరాబాద్, జూలై 17 (నేటి దర్శిని):ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా అతిక్రమణలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు వ్యవస్థను ఉద్దేశించి "ప్రియమైన @TelanganaDGP గారు" అంటూ ట్విట్టర్ ద్వార బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన పోస్ట్ చేశారు."తెలంగాణ ప్రజలు పరిపాలనలోని దుర్వినియోగాన్ని, భయంకరమైన దృష్టాంతాలను గమనిస్తున్నారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉండరని గుర్తుంచుకోండి. మేము తిరిగి వస్తాం. ప్రతి చర్యను సమీక్షిస్తాం" అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.అదే సమయంలో, "మాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం...