Newspaper Banner
Date of Publish : 17 July 2025, 11:38 am Digital Edition : Unknown Author

కేటీఆర్ సంచలన ట్వీట్

హైదరాబాద్, జూలై 17 (నేటి దర్శిని):
ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనా అతిక్రమణలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు వ్యవస్థను ఉద్దేశించి “ప్రియమైన @TelanganaDGP గారు” అంటూ ట్విట్టర్ ద్వార బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన పోస్ట్ చేశారు.

“తెలంగాణ ప్రజలు పరిపాలనలోని దుర్వినియోగాన్ని, భయంకరమైన దృష్టాంతాలను గమనిస్తున్నారు. ఎవరూ అధికారంలో శాశ్వతంగా ఉండరని గుర్తుంచుకోండి. మేము తిరిగి వస్తాం. ప్రతి చర్యను సమీక్షిస్తాం” అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

అదే సమయంలో, “మాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాటం కొనసాగుతూనే ఉంటుంది” అని స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ప్రజల భద్రత, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ వ్యవస్థ నిబద్ధంగా వ్యవహరించాలనే అభిప్రాయం బలపడుతోంది.

https://youtu.be/qWyCltCV7f8?si=JIzFsHnH1ml73f1B