PARK: పార్కుల ఆక్రమణలపై ఉక్కు పాదం
👉 తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక తుర్కయంజాల్, నేటి దర్శిని:తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పార్కులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు కమ్మగూడ జార్జ్ వెంచర్ కాలనీలో పార్క్ స్థలాన్ని ఆక్రమించి వేసిన రోడ్డును మున్సిపల్ అధికారులు ఈ రోజు కూల్చివేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తుర్కయంజాల్ ప్రాంతంలో పార్కుల పరిరక్షణకు మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ఖాళీగా ఉన్న పార్క్ స్థలాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, పూల మొక్కలు...