Newspaper Banner
Date of Publish : 16 July 2025, 2:55 pm Digital Edition : Unknown Author

PARK: పార్కుల ఆక్రమణలపై ఉక్కు పాదం

👉    తుర్కయంజాల్ మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక

తుర్కయంజాల్, నేటి దర్శిని:
తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని పార్కులను ఆక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ అమరేందర్ రెడ్డి హెచ్చరించారు. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు కమ్మగూడ జార్జ్ వెంచర్ కాలనీలో పార్క్ స్థలాన్ని ఆక్రమించి వేసిన రోడ్డును మున్సిపల్ అధికారులు ఈ రోజు కూల్చివేశారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, తుర్కయంజాల్ ప్రాంతంలో పార్కుల పరిరక్షణకు మున్సిపాలిటీ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని తెలిపారు. ఖాళీగా ఉన్న పార్క్ స్థలాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, పూల మొక్కలు నాటుతున్నామని వివరించారు. పార్కులపై ఎవరు అక్రమంగా కన్నేశారో సహించబోమని, ఇలాంటి చర్యలు మున్ముందూ కొనసాగుతాయని ఆయన హెచ్చరించారు.

ఈ సందర్భంగా డిప్యూటీ ఇంజనీర్ బిక్షపతి, అసిస్టెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.