చండీ యాగానికి హాజరైన రాజ్ కుమార్ రెడ్డి
👉 పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చక సంఘ ప్రతినిధులు, పురోహితులు 👉 పేటలో అర్చక సంఘ కార్యాలయ ఏర్పాటుకు 200 గజాల స్థలాన్ని కేటాయిస్తామన్న రాజ్ కుమార్ రెడ్డి 👉 హర్షధ్వానాలను వ్యక్తం చేసిన అర్చక సంఘ సభ్యులు, పురోహితులు ఎల్.బీ.నగర్ జూలై16 (నేటి దర్శిని):ధూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ కాచిగూడలోని తూల్జాభవన్ లో బుధవారం నిర్వహించిన పంచకుండాత్మక చండీ, కుబేర పాశుపత యాగానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు....