దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వీధికుక్కల స్వైర విహారం!
రాత్రి 9.30 తర్వాత కనిపించని సిబ్బంది... భయాందోళనలో రోగులు, చిన్నపిల్లల తల్లులు... దేవరకొండ జూలై07 (నేటి దర్శిని):నల్లగొండ జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో బాధితులకు చికిత్స అందాల్సిన చోట… వీధికుక్కలు విచ్చలవిడిగా తిరుగుతున్న దృశ్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రాత్రి వేళల్లో అత్యవసరంగా వైద్య సేవలు అందించే ఆసుపత్రి దుస్థితిని చూసి ప్రజలు ఖంగుతిన్న పరిస్థితి ఇది.ఆదివారం రాత్రి 9:30 ప్రాంతంలో తీసిన ఈ చిత్రాల్లో స్పష్టంగా కనబడుతోందేమంటే, ఎమర్జెన్సీ విభాగం ముందు కుక్కలు నడుస్తున్నాయి, ఆసుపత్రి లోపలికి స్వేచ్ఛగా వెళ్లి వచ్చేస్తున్నాయి....