విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించిన రాజ్ కుమార్ రెడ్డి
ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం ధన్వాడ జూన్26 (నేటి దర్శిని):నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కంసాన్ పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గురువారం సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరై విద్యార్థినీ విద్యార్థులతో అక్షరాభ్యాసం చేయించారు. అంతకుముందు తల్లిదండ్రులకు విద్యార్థినీ విద్యార్థులు పాదపూజ చేశారు. అనంతరం రాజ్ కుమార్ రెడ్డిని పాఠశాల ఉపాధ్యాయులు, యువకులు, విద్యార్థులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. సమస్యలను ఏకరువు పెట్టిన...