ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ నేతల చేతివాటం
నేటి దర్శిని గుర్రంపోడు జూన్ 25 : పేదలకు ఇచ్చే ఇండ్లలో కూడా రాజకీయ పార్టీల అవినీతి తిమింగళాలు జొరబడ్డాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదలకు ఇందిరమ్మ ఇంటి పథకంలో రాజకీయ దళారులు, కాదు.. కాదు.. అధికార పార్టీ నేతలు మోపయ్యారు. నిరుపేదలకు సొంతింటిని ఆశ చూపి రూ.లక్షలు దండుకుంటున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. పేదల దగ్గర స్వయంగా నాయకులు రూ.లక్షలు పోగు చేసుకుంటున్నట్లు మండల ప్రజల్లో బాగా ప్రచారం జరుగుతున్నది. గుర్రంపోడు మండలంలో ముఖ్య నేతలు ఇందిరమ్మ ఇంటికి రూ.లక్ష...