Newspaper Banner
Date of Publish : 01 June 2025, 7:44 pm Digital Edition : Unknown Author

దేశానికి సేవ చేయాలనే ఆలోచన గొప్పది రాజ్ కుమార్ రెడ్డి

ఆర్మీ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ ను అందజేత

నారాయణపేట జూన్01 (నేటి దర్శిని): వారియర్స్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్మీ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు నారాయణపేట జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆవరణలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థులకు వైద్య పరీక్షలు చేశారు. ఆర్మీ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులకు సాయంత్రం స్టడీ మెటీరియల్ ను భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అభ్యర్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనే సంకల్పం చాలా గొప్పదని అన్నారు. అంతకుముందు రాజ్ కుమార్ రెడ్డిని నిర్వాహకులు శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారియర్స్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ రవికుమార్ గౌడ్, వారియర్స్ డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ ఆర్మీ ఆంజనేయులు, అధిక సంఖ్యలో అభ్యర్థులు, ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, శివరాజ్, వై.సంతోష్, నందుకుమార్, నాగురావు  తదితరులు పాల్గొన్నారు.