HCU: చెట్ల నరికివేతపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం..!
100 ఎకరాల్లో పునరుద్ధరణ చేయండి, లేకపోతే అందరూ జైలుకే....! నేటి దర్శిని న్యూస్ డెస్క్: హైదరాబాద్ యూనివర్సిటీ భూముల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేకుండా చెట్లు నరికి, ప్రకృతి సమతుల్యతను భంగం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. ముఖ్యంగా చెట్ల నరికివేతతో జింకలు బయటకు రావడం, అవి కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం పట్ల కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. "ఆ వీడియోలు చూసి మేమూ ఆందోళనకు గురయ్యాం," అని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. చెట్లు నరికే ముందు...