Newspaper Banner
Date of Publish : 14 April 2025, 3:53 pm Digital Edition : Unknown Author

శబరిపీఠంలో పడిపూజకు హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

నారాయణపేట ఏప్రిల్14 (నేటి దర్శిని):
విషు పూజ సందర్భంగా నారాయణపేట వల్లంపల్లి గ్రామంలో ఉన్న శబరి పీఠం సన్నిధానంలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ జరిగింది. పడిపూజలో భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించగా, రాజ్ కుమార్ రెడ్డి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు బాలాజీ, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, రుద్రారెడ్డి, గోపాల్ గౌడ్, శివరాజ్, ఎం.సంతోష్, అశోక్, గోపాల్, నర్సింహనాయుడు, ఎ.నర్సింహులు, లక్ష్మీకాంత్, నందుకుమార్, చామకూర నగేష్, నిర్వాహకులు కాకర్ల భీమయ్య, భక్తులు పాల్గొన్నారు.