ప్రతిఒక్కరూ పూలేను ఆదర్శంగా తీసుకోవాలి: రాజ్ కుమార్ రెడ్డి

మహనీయుల ఆశయాలకనుగుణంగా ముందుకు సాగుతాం ఎల్బీనగర్ లో పూలే, జయశంకర్ సార్, శ్రీకాంతాచారి విగ్రహాల వద్ద నివాళులర్పించిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి ఎల్.బీ.నగర్ ఏప్రిల్11 (నేటి దర్శిని):ప్రతిఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు నాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఎనలేని కృషి చేశారని, ఆయన చేసిన సేవలను నేటితరం యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. సంఘ సంస్కర్త, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతి...