Newspaper Banner
Date of Publish : 18 March 2025, 12:00 pm Digital Edition : Unknown Author

కేటీఆర్‌కు మధుయాష్కి గౌడ్ సవాల్

ఎల్.బీ.నగర్ మార్చి18 (నేటి దర్శిని):
బీఆర్‌ఎస్ పార్టీ ఎల్బీనగర్ ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్ తీవ్రంగా ఖండించారు. మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుధీర్ రెడ్డి నీ  వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల చంచల్గూడ జైలులో మహిళా జర్నలిస్టులను పరామర్శించినప్పుడు మహిళలను గౌరవించాలన్న కేటీఆర్, ఇప్పుడు తన పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు.ఇలాంటి వ్యాఖ్యలు మహిళలను అవమానించడమేనని, కేటీఆర్ తక్షణమే స్పందించి బాధ్యత వహించాలని, అలాగే సుధీర్ రెడ్డితో బహిరంగంగా క్షమాపణ చెప్పించాలని మధుయాష్కి డిమాండ్ చేశారు.