మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజకుమార్ రెడ్డి మహిళా పారిశుద్ధ్య కార్మికులకు, మహిళలకు సన్మానం, చీరల అందజేత సేవారంగంలో ముందుకు సాగాలని మహిళల ప్రశంసలు నారాయణపేట మార్చి10 (నేటిదర్శిని):మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపార, రాజకీయ రంగాల్లో రాణించాలని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నారాయణపేట మున్సిపాలిటీలో పని చేస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులను, గిరిజన మహిళలను, మహిళలను నారాయణపేటలో శాలువలతో ఘనంగా సత్కరించి చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో...