ఘనంగా శ్రీ స్తంభాల లక్ష్మీ నరసింహ స్వామి జాతర
ముఖ్య అతిథిగా పాల్గొన్న బుసిరెడ్డి పాండురంగారెడ్డి గుర్రంపోడు మార్చి10 (నేటిదర్శిని):నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ స్తంభాల లక్ష్మీ నరసింహ స్వామి వారి జాతర మహోత్సవంలో బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గౌరవ శ్రీ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. జాతర సందర్భంగా గ్రామ కమిటీ వారు బుసిరెడ్డి పాండురంగారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు....