తెలంగాణలో అఖిలపక్ష సమావేశంపై రఘునందన్ రావు హాట్ కామెంట్స్
నేటి దర్శిని న్యూస్ డెస్క్ (హైదరాబాద్): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి నిధులు సాధించాల్సిన అంశం గల్లీలో కాదు, ఢిల్లీలో తేల్చుకోవాలని ఆయన అధికారపక్షానికి చాలెంజ్ చేశారు. "షార్ట్ నోటీసులో ఆల్ పార్టీ మీటింగ్‌కు రమ్మంటే ఎలా?" అంటూ ప్రశ్నించిన ఆయన, "మీ పంచాయితీ అంతా ఢిల్లీలోనే కదా? కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో అన్ని పార్టీల సమావేశం పెట్టుదాం. ఎంపీలందరం కలిసి కేంద్ర మంత్రులను కలుద్దాం" అని...