అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.. ఎం.ఎల్.సీ కవిత కీలక వ్యాఖ్యలు

నేటిదర్శిని, వెబ్‌డెస్క్: తెలంగాణ భవన్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవవేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్చట్టాన్ని అమలు చేయకపోవడంతో మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని జనగణనతో ముడిపెట్టి కేంద్రం ఇప్పటికీ అమలు చేయడం లేదని మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లు అమలుకానందు వల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా ఎన్నికల్లో మహిళలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. జనగణనకు బడ్జెట్‌లో ఎందుకు నిధులు పెట్టలేదని ప్రశ్నించారు. త్వరగా జనగణన...