Newspaper Banner
Date of Publish : 02 March 2025, 8:44 am Digital Edition : Unknown Author

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన పాశం గోపాల్ రెడ్డి

గుర్రంపోడు మార్చి01 (నేటిదర్శిని):
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లింలకు బీ.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి  శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవ చేయాలన్న సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయని గోపాల్ రెడ్డి తెలిపారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిస్తోందన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని పాశం గోపాల్ రెడ్డి ఆకాంక్షించారు.