డిసిసిబి బ్యాంకు మేనేజర్ వేధింపులు.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు

గుర్రంపోడు ఫిబ్రవరి25 (నేటిదర్శిని):నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం తేనెపల్లి తండాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. డిసిసిబి బ్యాంకు సిబ్బంది వేధింపులు తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాల్లోకి వెళితే, వడిత్య జవహర్ లాల్ అనే రైతు బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించమని బ్యాంకు మేనేజర్ ఉదయకుమార్, ఫీల్డ్ ఆఫీసర్ శంకర్ రైతును తీవ్రంగా వేధించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బ్యాంకు సిబ్బంది రైతు పొలంలో జెండాలు పాతి, ఇంటికి వెళ్లి మరింత ఒత్తిడి తేవడంతో తీవ్ర మానసిక...