శరీర దారుఢ్యానికి కరాటే శిక్షణ అవసరం రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేటలో కరాటే పోటీలు వివిధ రాష్ట్రాల నుండి తరలివచ్చిన విద్యార్థులు నారాయణపేట ఫిబ్రవరి16 (నేటిదర్శిని):శరీర దారుఢ్యానికి, మానసిక వికాసానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. డ్రాగన్ షోటేకాన్ కరాటే డు స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఎస్.ఆర్.గార్డెన్స్ లో ఆదివారం 24వ నేషనల్ కరాటే అండ్ కుంగ్ ఫు చాంపియన్‌షిప్-2025 పేరిట కరాటే పోటీలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్ కుమార్ రెడ్డి హాజరై పోటీల్లో ప్రతిభ కనబర్చిన కరాటే...