ఎస్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి దూసుకెళ్లిన గుర్రంపోడు జట్టు
హేమ హేమిలైన జట్లపై అద్భుత ప్రదర్శన గుర్రంపోడు ఫిబ్రవరి11 (నేటిదర్శిని):నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ క్రికెట్ రూల్స్ ప్రకారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎస్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో గుర్రంపోడు టీం అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. కేవలం ఒక సాధారణ టీంగా బరిలోకి దిగిన ఈ జట్టు, టోర్నమెంట్ ప్రారంభంలో పెద్దగా అంచనా లేకుండా బరిలోకి దిగి మ్యాచ్‌లు ముందుకు సాగించేకొద్దీ తమ అసలైన ఆటతీరు ప్రదర్శిస్తూ, ప్రత్యర్థి జట్లను ఓటమికి గురిచేయడం ప్రారంభించింది. హేమహేమీలుగా భావించిన జట్లను కూడా మట్టికరిపిస్తూ అద్భుత...