Newspaper Banner
Date of Publish : 11 February 2025, 6:21 pm Digital Edition : Unknown Author

ఎస్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కి దూసుకెళ్లిన గుర్రంపోడు జట్టు

హేమ హేమిలైన జట్లపై అద్భుత ప్రదర్శన

గుర్రంపోడు ఫిబ్రవరి11 (నేటిదర్శిని):
నల్లగొండ జిల్లా, కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ క్రికెట్ రూల్స్‌ ప్రకారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎస్‌పీఎల్ క్రికెట్ టోర్నమెంట్‌లో గుర్రంపోడు టీం అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. కేవలం ఒక సాధారణ టీంగా బరిలోకి దిగిన ఈ జట్టు, టోర్నమెంట్ ప్రారంభంలో  పెద్దగా అంచనా లేకుండా బరిలోకి దిగి మ్యాచ్‌లు ముందుకు సాగించేకొద్దీ తమ అసలైన ఆటతీరు ప్రదర్శిస్తూ, ప్రత్యర్థి జట్లను ఓటమికి గురిచేయడం ప్రారంభించింది. హేమహేమీలుగా భావించిన జట్లను కూడా మట్టికరిపిస్తూ అద్భుత విజయాలను సాధించింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్‌లో, గుర్రంపోడు టీం ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. జట్టు సభ్యుల అద్భుతమైన కృషి, ఒత్తిడిని తట్టుకుని ఆడిన ఆటగాళ్ల పట్టుదల ఈ విజయంలో ప్రధాన భూమిక పోషించాయి. ఈ సందర్బంగా, పలువురు క్రీడాభిమానులు, గ్రామస్థులు, ప్రముఖులు గుర్రంపోడు టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఫైనల్‌లో కూడా ఇలాగే విజయం సాధించాలని ఆకాంక్షించారు.