అనుమతి లేకుండా ఇసుక తరలింపు – ఇద్దరు అరెస్ట్, రెండు ట్రాక్టర్లు సీజ్

గుర్రంపోడు ఫిబ్రవరి10 (నేటిదర్శిని):అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం తెల్లవారుజామున గుర్రంపోడు పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు, కనగల్ వాగు నుండి కొప్పోలు గ్రామానికి అక్రమంగా ఇసుక తరలింపుపై సమాచారం అందింది. దీనిపై గుర్రంపోడు పోలీసులు కొప్పోలు బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించగా, ఇసుక లోడుతో వెళ్తున్న రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. పట్టుబడిన ట్రాక్టర్ల వివరాలు వరుసగా మొదటి...