Newspaper Banner
Date of Publish : 10 February 2025, 10:05 pm Digital Edition : Unknown Author

అనుమతి లేకుండా ఇసుక తరలింపు – ఇద్దరు అరెస్ట్, రెండు ట్రాక్టర్లు సీజ్

గుర్రంపోడు ఫిబ్రవరి10 (నేటిదర్శిని):
అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సోమవారం తెల్లవారుజామున గుర్రంపోడు పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పసుపులేటి మధు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు, కనగల్ వాగు నుండి కొప్పోలు గ్రామానికి అక్రమంగా ఇసుక తరలింపుపై సమాచారం అందింది. దీనిపై గుర్రంపోడు పోలీసులు కొప్పోలు బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించగా, ఇసుక లోడుతో వెళ్తున్న రెండు ట్రాక్టర్లు పట్టుబడ్డాయి. పట్టుబడిన ట్రాక్టర్ల వివరాలు వరుసగా మొదటి ట్రాక్టర్ ఇంజిన్ నంబర్ AP-24-AY-6461, ట్రాలీ నంబర్ AP-24-AY-6462, రెండవ ట్రాక్టర్ ఇంజిన్ నంబర్ AP-22-AL-7615, ట్రాలీ నంబర్ TS-05-UD-6958, ఈ రెండు ట్రాక్టర్లు పూర్తిగా ఇసుకతో నిండిపోయి ఉండగా, సరైన అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. పోలీసులు ఈ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.