Newspaper Banner
Date of Publish : 07 February 2025, 3:25 pm Digital Edition : Unknown Author

సామూహిక ఉపనయన కార్యక్రమానికి హాజరైన రాజ్ కుమార్ రెడ్డి

రాజ్ కుమార్ రెడ్డిని సత్కరించిన నిర్వాహకులు

నారాయణపేట ఫిబ్రవరి07 (నేటిదర్శిని):
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఈశ్వర్ మందిర్ మడి మహేల్ లో శుక్రవారం జరిగిన సామూహిక ఉపనయన (ముంజ్) కార్యక్రమానికి భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి.. ఫౌండేషన్ సభ్యులతో కలిసి హాజరయ్యారు. శివాలయంలో శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు రాజ్ కుమార్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రుద్రారెడ్డి, శివరాజ్, శ్రీనివాస్, చామకూర నగేష్, ఎం.సంతోష్, వై.సంతోష్, వెంకటరావెంకటరావు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.