గుర్రంపోడులో నీటి సమస్యతో అల్లాడుతున్న ప్రజలు
మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం గుర్రంపోడు ఫిబ్రవరి07 (నేటిదర్శిని): నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలో తాగునీటి కొరతతో తీవ్రంగా ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ప్రస్తుతం గ్రామ ప్రజలకు అందుబాటులో లేకపోవడంతో, గత పది రోజులుగా నీటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.ప్రతిరోజూ గృహాలకు మిషన్ భగీరథ ద్వారా నీరు సరఫరా చేయాల్సి ఉండగా, ఇటీవల నీరు రావడం పూర్తిగా నిలిచిపోయింది. దీంతో గ్రామస్తులు ఇతర మార్గాల్లో నీటి కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి...