Homeతెలంగాణఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: యాతాకుల ప్రమోద్ కుమార్

ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది: యాతాకుల ప్రమోద్ కుమార్

📰 Generate e-Paper Clip

సీఎం రేవంత్ రెడ్డిని సన్మానించిన యాతాకుల ప్రమోద్

ఎల్.బి.నగర్ ఫిబ్రవరి06 (నేటిదర్శని):
ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డిని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరిగారి ప్రీతమ్ ఆధ్వర్యంలో టీ పీసీసీ కో-ఆర్డినేటర్ యాతాకుల ప్రమోద్ కుమార్ కలిసి ధన్యవాదాలు తెలిపి శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదమే నిదర్శనమి అన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సానుకూలంగా ఉన్నా, కొందరు ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు పాల్పడినా కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular