మహిళకు కళ్లజోడును అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్
కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోడు అందజేత ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన వెంకటమ్మ నారాయణపేట జనవరి28 (నేటిదర్శిని):కంటి చూపుతో బాధపడుతున్న ఓ మహిళకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సహకారంతో కంటి పరీక్షలు చేయించి డాక్టర్ సలహా మేరకు కళ్లజోడును అందజేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన పి.వెంకటమ్మ గత కొంతకాలంగా కంటిచూపు లేమితో బాధపడుతుంది. తాను కంటిచూపు సమస్యతో బాధపడుతున్న విషయాన్ని వెంకటమ్మ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు....