Newspaper Banner
Date of Publish : 28 January 2025, 6:53 pm Digital Edition : Unknown Author

మహిళకు కళ్లజోడును అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్

కంటి పరీక్షలు నిర్వహించి కళ్లజోడు అందజేత

ఫౌండేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపిన వెంకటమ్మ

నారాయణపేట జనవరి28 (నేటిదర్శిని):
కంటి చూపుతో బాధపడుతున్న ఓ మహిళకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి సహకారంతో కంటి పరీక్షలు చేయించి డాక్టర్ సలహా మేరకు కళ్లజోడును అందజేశారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన పి.వెంకటమ్మ గత కొంతకాలంగా కంటిచూపు లేమితో బాధపడుతుంది. తాను కంటిచూపు సమస్యతో బాధపడుతున్న విషయాన్ని వెంకటమ్మ భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. విషయాన్ని తెలుసుకున్న ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి ఆమెకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైతే కళ్లజోడును అందజేసేలా చూడాలని ఫౌండేషన్ సభ్యులను ఆదేశించారు. చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు సభ్యులు వెంకటమ్మకు కంటి పరీక్షలు చేయించారు. డాక్టర్ సూచన మేరకు కళ్లజోడును అందజేశారు. ఈ సందర్భంగా వెంకటమ్మ మాట్లాడుతూ తాను గత కొంతకాలంగా కంటిచూపుతో బాధపడుతున్నానని, ఈ విషయాన్ని ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సహకారంతో తనకు కంటి పరీక్షలు చేయించి, డాక్టర్ సలహా మేరకు కళ్లజోడును అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు. తనకు కంటి పరీక్షలు చేయించి కళ్లజోడును అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డికి, సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వెంకటమ్మ వెంట ఫౌండేషన్ సభ్యులు నర్సింహనాయుడు తదితరులు ఉన్నారు.