మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి ఆదిత్య పరాశ్రీ గురువు

ప్రభుత్వ పాఠశాలకు రూ.61వేల విలువైన మైకు, బ్యాండ్‌ను అందజేసిన భీష్మరాజ్ ఫౌండేషన్ నారాయణపేట జనవరి26 (నేటిదర్శిని):దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులను విద్యార్థులు, యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని శ్రీశ్రీశ్రీ అంబాత్రయ క్షేత్రం, త్రిశక్తి పీఠం వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ డాక్టర్ ఆదిత్య పరాశ్రీ గురువు పిలుపునిచ్చారు. భారతదేశ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా పెద్దజట్రం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం జరిగిన వేడుకలకు గురూజీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి...