నల్గొండ రైతు మహా ధర్నాకు అనుమతి నిరాకరణపై పాశం గోపాల్ రెడ్డి ఆగ్రహం
గుర్రంపోడు జనవరి20 (నేటిదర్శిని):తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పాశం గోపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు నల్గొండలో జరగనున్న రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. "రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు. ప్రతిపక్షం చేస్తున్న ధర్నాకు అనుమతి నిరాకరణ ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమే అని పాశం గోపాల్ రెడ్డి ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ విషయంలో ప్రభుత్వం రైతులను మోసం చేసిందని విమర్శలు...