పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేటలో పారిశుద్ధ్య కార్మికులకు స్వెట్టర్ల పంపిణీ నారాయణపేట జనవరి10 (నేటిదర్శిని):నారాయణపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వెట్టర్లను ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి శుక్రవారం నారాయణపేటలో అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెల్లవారుజామున చలిలో విధులను నిర్వహించే పారిశుద్ధ్య కార్మికులు చలితో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారికి స్వెట్టర్లను అందజేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులు చలిలో విధులను నిర్వహిస్తూ ఇబ్బందులు పడుతున్నట్లు కార్మికులు ఫౌండేషన్ సభ్యుల దృష్టికి తీసుకురావడం జరిగిందని, కార్మికులకు స్వెట్టర్లను...