వైద్యుల నిర్లక్ష్యంతో పసికందు మృతి

దేవరకొండ జనవరి08 (నేటిదర్శిని): దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే దేవరకొండ మండలం మర్రిచెట్టు తండా కు చెందిన మూడవత్ నందిని మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ప్రసూతి కోసం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చేయగా మగ శిశువు జన్మించాడు. శిశువుకు పరిస్థితి బాగాలేదు అంటూ హైదరాబాదుకు తీసుకెళ్లాలని డాక్టర్లు సూచించారు.హైదరాబాద్ కి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందిందని డాక్టర్లు నిర్ధారించారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బిడ్డ మరణించాడని మృతి చెందిన తర్వాత తమకు సీరియస్...