విద్యార్థులు క్రీడల్లో రాణించాలి రాజ్ కుమార్ రెడ్డి
నారాయణపేటలో కరాటే విద్యార్థులకు బెల్టుల ప్రధానం నారాయణపేట జనవరి04 (నేటిదర్శిని): శరీర దారుఢ్యానికి, మానసిక వికాసానికి కరాటే శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. మా కేశవ్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఫౌండర్ వ్యవస్థాపకులు కేశవ్ మాస్టర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన కరాటే విద్యార్థిని విద్యార్థులకు శనివారం నారాయణపేట పట్టణంలోని ఎస్.ఆర్.గార్డెన్స్ లో బెల్టుల ప్రధానోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి హాజరై విద్యార్థినీ విద్యార్థులకు...