గౌరవ డాక్టరేట్ అందుకున్న రాజ్ కుమార్ రెడ్డి
ఎల్.బి.నగర్ డిసెంబర్28 (నేటిదర్శిని):ఆపదలో ఉన్న పేదవారికి అభయ హస్తాన్ని అందిస్తూ పేదల గుండెల్లో గుడి కట్టుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ కె.రాజ్ కుమార్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ అకాడమీ వారు గౌరవ డాక్టరేట్ ను శనివారం తమిళనాడులోని వసూర్ లో అందజేశారు. గౌరవ డాక్టరేట్ ను అందుకున్న కె.రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతున్న వారికి చేయూతనందిస్తూ, విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో యువతను ప్రోత్సహిస్తూ విశేష సేవలు అందిస్తున్నామని తెలిపారు. తాము చేస్తున్న సేవలను...