KTR: బీ ఆర్ ఎస్ అంటే ‘భారత రైతు సమితి’… రైతులకు కేటీఆర్ బహిరంగ లేఖ

న్యూస్ డెస్క్ నేటి దర్శిని: బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కొట్లాట మనకు కొత్తది కాదు అంటూ ఆదివారం రైతన్నలకు కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. అన్నదాత లారా... రైతు భరోసా నిధుల ఎగవేత మోసాన్ని ఎదిరించాలని సూచించారు. అడ్డగోలు ఆంక్షలతో కోతలతో సగం మందికి ఎగనామం పెట్టాలని చూస్తున్న ఈ ప్రభుత్వ ఎత్తుగడలను చిత్తు చేయాలన్నారు. ప్రతి ఎకరాకు... ప్రతి రైతుకు పెట్టుబడి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాలని పిలుపునిచ్చారు. శాసనసభలో రైతు భరోసా పైన...