HomeతెలంగాణHyderabad : అల్లు అర్జున్ ఇంటిపై దాడి

Hyderabad : అల్లు అర్జున్ ఇంటిపై దాడి

📰 Generate e-Paper Clip

సినిమా న్యూస్ నేటి దర్శిని: హైదరాబాదులోని అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఆరుగురు ఓయూ జాక్ నాయకులను పోలీసుల అరెస్టు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమంటూ నినాదాలు చేసుకుంటూ ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. గేటు లోపలికి వెళ్లి పూల కుండీలను ధ్వంసం చేశారు. అయితే దాడి జరిగిన సమయంలో అల్లు అర్జున్ ఇంట్లో లేరని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇంటి వద్ద పోలీసులు భారీ బలగాలను మోహరించారు. అల్లు అర్జున్ ఇంటిపై దాడి నేపథ్యంలో అతని మామ కాంగ్రెస్ లీడర్ చంద్రశేఖర్ ఈ ఘటనపై ఆరా తీశారు. అల్లు అర్జున్ పిల్లలు ఆయాన్, అర్హాను సిబ్బంది సహాయంతో ఆయన తన ఇంటికి తరలించారు. కాగా తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జాక్ నాయకులు డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular